సంగారెడ్డి, జూన్ 15: జాతీయ మెగా లోక్ అదాలత్‌లో భాగంగా సైబర్ క్రైమ్ రీఫండ్‌లో సంగారెడ్డి జిల్లాకు ఐదోస్థానం వచ్చిందని, మెగా లోక్ అదాలత్‌లో 4287 కేసులు రాజీతో పరిష్కరించుకున్నారని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.1.43 కోట్లను బాధితులకు ఈనెల 14న జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో అందజేసినట్లు తెలిపారు.
లోక్ ఆదాలత్‌లో 4287 కేసులను రాజీ చేసుకోవడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రజలు ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్చేసి లేదా, ఎన్సీఆర్పీ పోర్టల్‌లో లాగిన్ అయి దరఖాస్తు చేయాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసిన అధికారులు డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, డీ4సీ ఇన్స్పెక్టర్ రవి, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ కిరణ్, ఎస్ఐ సత్యనారాయణ, అధికారులు, కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.