సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 28: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలోని 13 రకాల యూనిట్ల గ్రౌండింగ్ ఈ నెలా ఖరులోగా 100శాతం పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు, డీపీఏంలు, ఏపీఎంలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో భాగంగా స్కూల్ యూనిఫామ్స్ కుట్టుపని, స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం 13 రకా ల పథకాలను తీసుకొచ్చిందన్నారు. మదర్ ఫౌల్ట్రీ ఫామ్ యూనిట్ లక్ష్యా న్ని వచ్చేనెల మొదటి వారంలోగా నెరవేర్చాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేని ఏపీఎంలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఆర్డీవో పీడీని ఆదేశించారు.
మహిళా శక్తి రుణాల కోసం కలెక్టరేట్‌కు ఎవ రూ రాకుండా క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు.ప్రతి వార్డు లో పారిశుధ్య నిర్వహణకు ముగ్గురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చే యాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీవో జ్యోతి, మెప్మా పీడీ గీత, జిల్లాలోని గ్రామీణాభివృద్ధి శాఖ డీపీఎంలు, ఏపీఎంలు, అధికారులు పాల్గొన్నారు.