నీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
వేసవిలో నీటి ఎద్దడి లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతిక్‌జైన్ అధికారులను ఆదేశించారు.
- సమీక్షా సమావేశంలో సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్‌జైన్
నారాయణఖేడ్, ఏప్రిల్ 28: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతిక్‌జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎంపీడీవోలు, గ్రామీణ నీటిసరఫరా తదితరశాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నివాసానికి తాగు నీటి సరఫరా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, శానిటైజేషన్, సాదాబైనామాలు, భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై చర్చించారు.
ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఆలస్యం లేకుండా సకాలంలో చెల్లించాలన్నారు. సాదాబైనామాలు, భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. లోవోల్టేజీ, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్లైన్ల మరమ్మతులు వంటి సమస్యలు 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో సబ్‌కలెక్టర్ ఉమాహారతి, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, విద్యుత్, హౌసింగ్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

