పటాన్చెరు, ఆగస్టు 10: ఫైలేరియా నిర్మూలనకు కృషిచేద్దామని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని జ్యోతిబాఫూలే బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో జాతీయ ఫైలేరియా,నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.గాయత్రిదేవితో కలసి అదనపు కలెక్టర్ ఫైలేరియా, నులిపురుగుల నిర్మూల మాత్రలను విద్యార్థులకు అందజేశారు. ఆరోగ్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బొల్లారం, ఆగస్టు 10: దోమ కాటుతో వచ్చే ఫైలేరియాను సమూలంగా పారదోలుదామని బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పారిశ్రామికవాడలోని థర్మల్ సిస్టమ్స్ పరిశ్రమలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ ఫైలేరియా నివారణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ… ఫైలేరియాను నిర్మూలించేందుకు అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. మెడికల్ ఆఫీసర్ నిర్మలారెడ్డి, డాక్టర్లు భవాని, కార్తీక్, ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనందరావు, ప్రధాన కార్యదర్శి రాయుడు, వైద్య సిబ్బంది, మెప్మా రిసోర్స్ పర్సన్స్, కార్మికులు పాల్గొన్నారు.
అనంతరం ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అమ్మ పేరుతో ఒక మొక నాటుదాం అనే నినాదం 2024’లో చైర్పర్సన్ రోజా బాల్‌రెడ్డి పాల్గొని పరిశ్రమల ప్రతినిధులతో కలిసి మొకనాటి నీరు పోశారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్‌రావు, ప్రధాన కార్యదర్శి రాయు డు, పరిశ్రమల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.
గుమ్మడిదల,ఆగస్టు10: మండల కేంద్రంలోని పీహెచ్సీ, కానుకుంట పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో వైద్యసిబ్బంది నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. మండల వైద్యాధికారి మధుకర్, డాక్టర్ ప్రత్యూష, ఎంపీహెచ్ వో శ్రీనివాస్‌రావు ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
పటాన్చెరు, ఆగస్టు 10: పటాన్చెరు డివిజన్ 113లో ఫైలేరియా నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని మెట్టు కుమార్‌యాదవ్ ప్రారంభించారు. పటాన్చెరు పట్టణంలో కార్పొరేటర్ నివాసం వద్ద సమీప ఇండ్లలోని ప్రజలకు ఉచితంగా ఫైలేరియా, నులిపురుగుల నివారణ మాత్రలు అందజేశారు. కార్యక్రమంలో జైపాల్, ప్రకాశ్, జనార్దన్‌రెడ్డి, విశ్వనాథం, మతిన్, బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అజ్మత్, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఆశవర్కర్లు ఆదిలక్ష్మి, కీర్తి, సుధా పాల్గొన్నారు.
జిన్నారం, ఆగస్టు 10 : మండలంలోని కొడకంచి, కిష్టయ్యపల్లి, పారిశ్రామికవాడల్లో ఫైలేరియా నివారణ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు ప్రకాశ్‌చారి, శివరాజ్, మాజీ ఎంపీటీసీలు జనాబాయి, వడ్డె కృష్ణ, మాజీ ఉపసర్పంచ్ అభిలాష్‌గౌడ్, అంగన్వాడీ, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.