
కంది, జూలై 8 : ఐఐటీ హైదరాబాద్‌లో ఇప్పటికే అన్ని రకాల సర్వీసులను తీసుకొచ్చారు. తాజాగా ఇక్కడి విద్యార్థులు, సిబ్బంది కోసం కొత్తగా పోస్టల్ సర్వీసునూ గురువారం డైరెక్టర్ బీఎస్‌మూర్తి, చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఎస్ రాజేంద్రకుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఐఐటీ హైదరాబాద్‌కు కొత్తగా పోస్టల్ పిన్ కోడ్ 502284ను అమలు చేశా రు. ఈ సందర్భంగా పోస్ట్‌మాస్టర్ జనరల్ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఐఐటీ హైద రాబాద్‌లో తమ పోస్టల్ సేవలను ప్రారంభించడం సం తోషంగా ఉందన్నారు. ఇకపై ఇక్కడి విద్యార్థులతో పా టు ప్రొఫెసర్లు ఇతర సిబ్బందికి అన్ని రకాల పోస్టల్ సర్వీసులు అందించనున్నామన్నారు. క్యాంపస్‌లోనే రోజూవారీ సేవలు అందుతాయన్నారు. మొత్తం సం గారెడ్డి జిల్లాలోని 27మండలాలు, 647గ్రామాల్లో 253 బ్రాంచ్‌ల ద్వారా పోస్టల్ సేవలు అందిస్తున్నామన్నారు.
రెండు హెడ్ పోస్టాఫీసులు, 43 సబ్ పోస్టాఫీసులు జిల్లా వ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయని వివరించారు. కొత్తగా కేటాయించిన పిన్ కోడ్‌తో ఐఐటీయన్లకు మెయిలింగ్ సమయం ఆదా అవుతుందన్నారు. ఈ సబ్ పోస్టాఫీసులో బ్యాంకింగ్, చిన్న మొ త్తాల పొదుపు, ఇన్సూరెన్సు ఇతర సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. అనంతరం ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ ఇప్పటికే క్యాంపస్‌లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులతో పాటు అధ్యాపక బృందానికి ఎలాంటి లోటు పాట్లు లేకుండా అన్ని రకాల సేవలను వినియోగంలోకి తీసుకొస్తున్నామన్నారు. తాజాగా ఇండియన్ పోస్టల్ సర్వీసులు కూడా క్యాంపస్‌లోనే ప్రారంభించి సేవలు అందించడంతో ఇక్క డి వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నా రు. ఈ కార్యక్రమం లో పీవీఎస్ రెడ్డి, మ నోహర్ నంబియార్, పీఆర్వో మిథాలి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.