జహీరాబాద్, అక్టోబర్ 2 : రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురును అందించింది. వానకాలంలో పండించిన పంటలకు శుక్రవారం మద్దతు ధర ప్రకటిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్‌లో పోస్టర్ విడుదల చేశారు. దీంతో మార్కెట్లో అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని నాణ్యతతో మార్కెట్‌యార్డుకు తరలించి మద్దతు ధర పొందాలని ప్రభుత్వం తెలిపింది. పత్తిలో తేమశాతం 8 నుంచి 12 శాతం ఉండాలని, తేమ 6-7 శాతం ఉంటే సీసీఐ ద్వారా బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా మార్కెట్ యార్డుకు తరలించకుండా వాటిని ఎండబెట్టి, శుభ్రపరిచిన తర్వాతనే మార్కెట్ యార్డుకు తరలించాలని పేర్కొన్నది. మార్కెట్ యార్టులో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన తేమశాతం కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్ తూకం (కాంటాలు) అధికారులు అందుబాటులో ఉంచారు.
పత్తిలో తేమ శాతాన్ని బట్టి మద్దతు ధర…
రాష్ట్ర ప్రభుత్వం పత్తిలో తేమశాతాన్ని బట్టి మద్దతు ధర ప్రకటించింది. పొడవుగింజ రకం పత్తిలో తేమశాతం 6 ఉంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే అదనంగా రూ.120.50 ఇస్తామని ప్రకటించింది. పొట్టిగింజ రకంలో క్వింటాల్‌కు అదనంగా రూ.118.50, 7తేమ శాతం ఉంటే అదనంగా రూ. 60.25, పొట్టిగింజ పత్తి రకానికి రూ. 59.25 ప్రకటించింది.
జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్లో..
జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్లో మద్దతు ధరలు ఇలా ఉన్నాయి. మినుములు క్వింటాల్కునాణ్యమైన రూ.5,500 నుంచి రూ.6,500 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. పెసర్లు రూ.5,200 నుంచి రూ. 6,200 వరకు ధర ఉంది. సోయా మంచి రకం రూ.5,500 వరకు ధర ఉంది. వారం రోజులుగా రైతులు వానకాలం పంటలను జహీరాబాద్ మార్కెట్‌కు విక్రయాల కోసం తరలిస్తున్నారు.
వాన కాలం పంటల మద్దతు ధర
పంట క్వింటాల్‌కు ధర