హుస్నాబాద్ టౌన్, మే31: జాతీయస్థాయి 26వ సబ్ జూనియర్ రోయింగ్ పోటీల్లో హుస్నాబాద్‌కు చెందిన కాశబోయిన అభిజిత్యాదవ్ బృందం గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించింది. మే 27 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో రోయింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో 25 రాష్ర్టాల క్రీడాకారులు పాల్గొన్నారు.
కాశబోయిన అభిజిత్యాదవ్తో కూడిన నలుగురు బృందం పాల్గొన్న పోటీలో గోల్డ్ మెడల్ సాధించగా, డబుల్స్‌లో సైతం అభిజిత్యాదవ్ టీం సిల్వర్ మెడల్స్‌ను సాధించింది. తెలంగాణ రోయింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏపీ మిథున్‌రెడ్డి మెడల్స్‌ను బహూకరించారు. మాజీ కౌన్సిలర్ కాశబోయిన లలిత, మురళి దంపతుల కుమారుడు అభిజిత్యాదవ్ బృందాన్ని జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న అభినందించారు.