Roads Damage | మిరుదొడ్డి, మార్చి 9 : గుంతల మయమైన బీటీ రోడ్లతో వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డి మీదుగా అందె గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా గుంతల మయమైంది. గుంతలు పడిన రోడ్డు మీదుగా ప్రయాణం చేయడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వందలాది వాహనదారులు నిత్యం అష్టకష్టాలు పడుతూ ప్రయాణం సాగిస్తుంటారు.
రోడ్డు సక్రమంగా లేకపోవడంతో రాత్రి వేళ్లలో గుంతలు కనించక పోవడంతో ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. దీంతో పాటు మిరుదొడ్డి నుంచి కాసులాబాద్, అక్బర్పేట-భూంపల్లి మండలం మోతె, చిట్టాపూర్ గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డుపై గుంతలు పడి పెద్ద పెద కంకర రాళ్లు తేలడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ చేసేదేమి లేక తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, సంబధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి నిత్యం వివిధ రకాల వందలాది వాహనాలు మిరుదొడ్డి నుంచి అందె, మిరుదొడ్డి నుంచి కాసులాబాద్, మోతె గ్రామాల వరకు వెళ్లుతున్నాయి. గుంతల మయమైన రోడ్లపై నూతన బీటీ రోడ్లను వేసి ప్రయాణీకుల కష్టాలను తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.