రాయికోడ్, మే11: రాయికోడ్ మండల పరిధిలోని సీరూర్ నుంచి గ్రామ శివారులో ఉన్న మంజీర నది (Manjeera Bridge) వద్ద ఏర్పాడిన పెద్ద గుంతలలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు, వావానదారులు భయపడుతున్నారు. నిత్యం లారీలు, ఆర్టీసీ బస్సులు అటోలు రాకపోకలు సాగిస్తున్నా ఆర్అండ్బీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాయికోడ్ నుంచి ఈ మార్గం గుండానే నారాయణ్‌ఖేడ్, మెదక్, నిజామాబాద్, జోగిపేట్, అల్లాదుర్గం తోపాటు బీదర్, జహీరాబాద్, సదాశివపేట్, హైదారాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాలకు ప్రతి రోజు ప్రయాణాలు సాగిస్తుంటారు.
ఈ రోడ్డుపైనే ఉన్న మంజీర బ్రిడ్జి వద్ద ఏర్పాడిన గుంత, సైడ్ వాల్ కూలిపోవడంతో ప్రమాదకరంగా మారాయి. ఈ రోడ్డుపైన రెండు వైపుల నుంచి వాహనాలు ఒకేసారి వస్తే ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈ రోడ్డుకు మరమ్మతు చేయకపోవడంతో ఈ ప్రాంతాంలోని ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు పటించుకపోవడంతో ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నా పంటించుకోకపోవడంతో ఏంచేయలేని స్థితిలో ఉన్నారు.