చేర్యాల, జూలై 24: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో నిర్వాహకులు మెనూ పాటించడం లేదు. బుధవారం విద్యార్థులకు చికెన్ పెటా ల్సి ఉండగా నిర్వాహకులు క్యాప్సికం కర్రీ వండిపెట్టారు. చికెన్ కర్రీ ఎందుకు వండలేదని ఇన్చార్జిని ప్రశ్నించగా ధరలు పెరిగాయని, మెస్ లాస్లో ఉందని అందుకే చికెన్ పెట్టలేదని వచ్చేవారం పెడతామన్నారు.
ప్రభుత్వం గురుకులానికి పంపిణీ చేసే బియ్యం సరిగ్గా లేక అన్నం ముద్దగా ఉండడంతో విద్యార్థులు తినేందుకు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు పెరుగు అందించకుండా మజ్జిగా పోస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట దా టినా విద్యార్థులకు భోజనం వడ్డించడం లేదు. అన్నం, కూరలు తయారు చేసే కిచెన్ పరిసరాల తోపాటు విద్యార్థులకు నీటిని అందించే ప్రదేశం అపరిశుభంగా విద్యార్థులకు సకాలంలో అన్నం వండేందుకు బీఆర్ఎస్ సర్కారు సరఫరా చేసిన బాయిలర్స్, మినరల్ వాటర్ ఆర్వో ప్లాంట్ కొన్ని నెలలుగా పని చేయడం లేదు.