పటాన్చెరు టౌన్, ఆగస్టు 21: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి సర్వేనంబర్ 23, 65లోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపట్టిన ఇండ్ల నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేయించారు. సర్వే నంబర్ 23లో ఒకటి, 65 సర్వేనెంబర్లో మరో ఇంటి నిర్మాణం జరుగుతున్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం వచ్చింది.
తహసీల్దార్ హరిబాబు ఆదేశాల మేరకు ఆర్ఐ, సిబ్బంది జేసీబీతో కూల్చివేయించారు. మరో ఇంటి నిర్మాణంపై కోర్టు స్టే ఉందని తహసీల్దార్ తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.