నిషిన్: ఏషియన్ గేమ్స్(Asian Games) టీ20 క్రికెట్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు 212 రన్స్ టార్గెట్‌ను విసిరింది టీమిండియా. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అయ్యర్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 రన్స్ చేసింది. తొలుత ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. అతను కేవలం 28 బంతుల్లో 61 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు భారీ సిక్సర్లు ఉన్నాయి. భారత బ్యాటర్లలో శివం దూబే, తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆరో వికెట్‌కు దూబే, వర్మ 62 రన్స్ జోడించారు. దూబే 15 బంతుల్లో 27 రన్స్ చేసి నిష్క్రమించాడు. తిలక్ వర్మ కూడా దుమ్మురేపాడు. అతను కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. పాక్ బౌలర్లలో దనియాల్, అరాఫత్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇండియన్ బ్యాటర్లలో వైభవ్ 15, శ్రేయాస్ 21, ఇషాన్ 20 రన్స్ చేశారు.
Innings Break!
Superb contributions all through the order take #TeamIndia to 2️⃣1️⃣1️⃣/6 in the Gold Medal contest 💪
Over to our bowlers to defend 🎯
Scorecard ▶️ https://t.co/g4wzZagyGj#AsianGames pic.twitter.com/nfMkldToiV
— BCCI (@BCCI) October 3, 2026