రేపు సీఎం రాక
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 15న స్థానిక అంబేద్కర్ మైదానంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సీఎం ప్రారంభించనున్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 13: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 15న స్థానిక అంబేద్కర్ మైదానంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సీఎం ప్రారంభించనున్నారు.
గురువారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్తో కలిసి కలెక్టర్ ప్రతీక్ జైన్ అంబేద్కర్ మైదానంలో ఏర్పాటు చేస్తున్న సభా వేదికను పరిశీలించారు. సాయంత్రం కలెక్టరేట్లో ఎస్పీ, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
1500 మంది పోలీసులతో భద్రత
సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. 1500 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పా ట్లు పటిష్టంగా చేయనున్నట్లు స్పష్టం చేశా రు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నా రు. అంతకుముందు సీఎం ల్యాండయ్యే ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణాన్ని సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, పోలీసు బలగాలతో పరిశీలించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

