హుస్నాబాద్, మే 11: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి సీఎం రేవంత్‌రెడ్డి అండగా ఉండి, పోక్సో కేసు కాకుండా కుట్రలు చేస్తున్నారని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డానే ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులైనా ఇప్పటి వరకు బండి భగీరథ్‌ను అరెస్టు చేయకపోవడంలో ఆంతర్య మేమిటని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన కొడుకును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని, రాష్ట్ర పోలీసులను వాడుకొని కేసులు కాకుండా చూస్తున్నాడని విమర్శించారు. పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన బాలిక కుటుంబాన్ని బెదిరిస్తూ కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. పోక్సో కేసును పక్కదారి పట్టించే యత్నం చేస్తున్న బండి సంజయ్‌ని మంత్రి పదవి నుంచి బర్త్ఫ్ చేయాలని, భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వొడితెల సతీశ్‌కుమార్ హెచ్చరించారు.