గజ్వేల్, అక్టోబర్ 28: విద్యావంతులు, మే ధావులకు వేదికగా శాసనమండలిని మార్చాలనే ముందుకు సాగుతున్నానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి ఆయన రాజీనామా చేసిన అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడా రు. 16 ఏండ్లుగా జూనియర్, డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా వివిధ ప్రాంతాల్లో పని చేశానని, 271 మండలాల్లో తన వద్ద చదువుకున్న విద్యార్థులు ఉన్నారన్నారు. నిరుద్యోగుల సమస్యలపై తనవంతు పోరాటం చేస్తానన్నారు.
శాసనమండలిలో నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి, పట్టభద్రుల సమస్యలు తెలిసిన వారికి మొదటి ప్రాధాన్యత కల్పించాలన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరగ డం లేదన్నారు. తెలంగాణలోని నిరుద్యోగు లు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధిలో రాణించేలా కృషి చేయాలన్నారు. 19 ఏండ్ల సర్వీస్ ఉండగా నిరుద్యోగుల కోసం ఉద్యోగానికి రాజీనామా చేశానన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.