మెదక్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఈజీఎస్ ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేయాలని, మూడు నెలల పెండింగ్ వేతనాన్ని తక్షణం చెల్లించాలంటూ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్‌కు మంగళవారం ఈజీఎస్ ఉద్యోగుల జేఏసీ వినతిపత్రం అందజేసిం ది. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ రాజ్ కుమా ర్ మాట్లాడుతూ..మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి తమవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిచో సమ్మె కార్యాచరణ ప్రకటిస్తామ ని తెలిపారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సైతం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం లో మహిపాల్ రెడ్డి, శ్యామ్‌కుమార్, శంకర్, పౌల్, వేణు, కృష్ణ, రాజేశ్వర్, రాము, శశిరేఖ, స్వప్న, బాలరాజ్, అనిల్, సంతోష్ పాల్గొన్నారు.