చిలిపిచెడ్,మే 7: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని బండపోతుగల్ గ్రామంలో సోమక్కపేట సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యంలో తాలు, మట్టి, పొల్లు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలన్నారు.
రైతులు తమ ధాన్యాన్ని తేమ శాతం లేకుండా చూడాలన్నారు. లారీల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్మిన వెంటనే తమ పట్టాపాస్‌బుక్, ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్‌లను ఇవ్వలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దాన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్ సహదేమ్, రైతులు ఉన్నారు.