వైభవంగా రథసప్తమి వేడుకలు
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన గు మ్మడిదలలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధర్మకర్తలు నర్సింహాచార్యులు, కేవీ. రంగనాథ చార్యుల ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలను నిర్వహించారు.
గుమ్మడిదల, ఫిబ్రవరి 16 : రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన గు మ్మడిదలలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధర్మకర్తలు నర్సింహాచార్యులు, కేవీ. రంగనాథ చార్యుల ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పడమటి లక్ష్మారెడ్డి, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
న్యాల్కల్లో..
న్యాల్కల్, జనవరి 28 : మండలంలోని రాఘవపూర్ గ్రామ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రంలో మూడు రోజులుగా జరుగుతున్న వసంత పంచమి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భం గా స్థానిక క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో క్షేత్ర ప్రధాన అర్చకుడు అయ్యప్పస్వామి పర్యవేక్షణలో సరస్వతీదేవి, సాయిబాబా, దత్తత్రేయ, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి, గంగామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు భజనలు, కీర్తనలతో సూర్యభగవాన్ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అందోల్‌లో..
అందోల్, ఫిబ్రవరి 16 : రథసప్తమి వేడుకలను శుక్రవారం జోగిపేటలో నిర్వహించారు. జోగినాథస్వామి ఆలయంలో స్వా మివారికి, రథానికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం లో జోగినాథస్వామి ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బొల్లారంలో..
బొల్లారం, ఫిబ్రవరి 16 : బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన ఆలయాల్లో శుక్రవారం రథసప్తమి వేడుకలను మహిళలు ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోచ మ్మ బస్తీలోని సూర్య ఆలయంలో తెల్లవారుజాము నుంచే మహిళలు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు.
శివపార్వతుల కల్యాణం
హత్నూర, ఫిబ్రవరి 16: హత్నూర మండ లం దౌల్తాబాద్‌లోని భవానీమాత స్పటిక లిం గేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కల్యాణం కనుల పండువగా జరి గింది. సాయంత్రం పాచిబండ్ల ఊరేగింపు, పల్లకీసేవ నిర్వహించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

