జహీరాబాద్, నవంబర్ 2: కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసే కర్ణాటక రాజ్యోత్సవ అవార్టును సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూర్ గ్రామానికి చెందిన జానపద సంగీత అంధ కళాకారుడు నర్సింహులు గౌడ్‌కు లభించింది. కర్ణాటకలో జానపద సంగీత కళారంగంలో విశేష కృషిచేసినందుకు శుక్రవారం బెంగళూర్‌లోని విధా న సభ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సీఎం సిద్ధిరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
అవార్డుతోపాటు రూ. 5లక్షల నగదు, రెండు తులాల బంగారు గొలుసు అందజేసి శాలువా కప్పి ఘనం గా సత్కరించారు. ఈ సందర్భంగా నర్సింహులు గౌడ్ మాట్లాడుతూ..అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. జానపద సంగీత కళారంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. నర్సింహులు గౌడ్‌ను డప్పూర్ గ్రామస్తులు అభినందించారు.