ఉదయం నుంచి కమ్ముకున్న కారుమబ్బులు
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షం
అన్నదాతల్లో ఆనందం..
వ్యవసాయపనుల్లో నిమగ్నం
మెదక్/సంగారెడ్డి ఫొటోగ్రాఫర్లు, జూలై 8 : మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి పలుచోట్ల చిరుజల్లులు పడ్డాయి. వాతావరణం చల్లబడి ముసురు అలుముకుంది.
కూలీలు, ఉద్యోగస్తులు, సామాన్య ప్రజలు రోజువారీ పనులకు వెళ్లేవారు కొద్దిపాటి ఇబ్బందులు పడ్డారు. వాతావరణం సాగుకు అనుకూలంగా మారడంతో వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.
సంగారెడ్డిలో వర్షంలో తడుస్తూ వెళ్తున్న వాహనదారులు