మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 6 : సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో)శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మద్దూరు మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమాన్ని డీఈవో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బోధన అందిస్తున్నట్లు తెలిపారు. విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు. బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాల న్నారు. హెచ్ఎంలు చంద్రశేఖరశర్మ, శ్రీశైలం, కస్తూర్బా ఎస్వో స్వప్న, ఉపా ధ్యా యులు, సీఆర్పీలు పాల్గొన్నారు.
మిరుదొడ్డి, జూన్ 6 : పల్లెల్లోని పోషకులు బడీడు పిల్లలను బడికి పంపించి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని మిరుదొడ్డి జడ్పీ పాఠశాల హెచ్ఎం ఎస్.వెంకట రామ లింగం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం మిరుదొడ్డి మండల వ్యా ప్తంగా ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, హస్టల్ వా ర్డున్లు పాల్గొన్నారు.
మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), జూన్ 6 : అక్బర్పేట-భూంపల్లి మండలంలోని ఆ యా గ్రామాల్లో గురువారం ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి బడి బాట కర పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గజ్వేల్, జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థుల సంఖ్యను పెంచేందుకు వీలుగా నేటి నుంచి19వ తేదీ వరకు చేపట్టే బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధ్యాయులు బడిబాటను ప్రారంభించారు. బడీడు పిల్లలు బడి లో చేర్పించేలా అవగాహన కల్పిస్తున్నారు.
హుస్నాబాద్‌టౌన్, జూన్ 6: బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం ఉపాధ్యాయుల బృందం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలనుంచి పలు వీధులమీదుగా ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కొండ్లె వాసుదేవరెడ్డి, అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ చైర్మన్ బెజ్జంకి వరలక్ష్మి, ఏఈ సాయిప్రణీత్, స్వయం సహాయక సంఘాల సభ్యులు గడిపె రజిత, నర్సమ్మ, ఎగ్గోజు సుదర్శనాచారి, ఉపాధ్యాయులు వీరారెడ్డి, సువర్ణ వెంకటరమణారెడ్డి, సుభాశ్, రాజమల్లు, శ్రీనివాస్, మార్కెండేయ, రాజేందర్, రమేశ్, శ్రీధర్, రజిత, రాజమౌళి, భాస్కర్, సీఆర్పీలు జోత్స్య, స్వప్న తదితరులు ఉన్నారు.
దుబ్బాక, జూన్ 6 : సర్కారు బడుల్లోనే విద్యార్థులకు గుణాత్మక విద్య అందుతుందని జీసీడీవో (గర్ల్ చైల్డ్ డెవలఫ్‌మెంట్ అధికారి) ముక్తేశ్వరి, దుబ్బాక ఎంఈవో ప్రభుదాస్ అన్నారు. గురువారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట, దుంపలపల్లితో పాటు మండలంలో హబ్షీపూర్, చీకోడ్, ఆకారం, పెద్దగుండవెళ్లి తదితర గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఆర్పీ తాళ్ల నవీన్ కుమార్, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కొమురవెల్లి, జూన్ 6 : బడీడు పిల్లలను బడీలో చేర్పించాలని కొమురవెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేశ్, మల్లేశం కోరారు. గురువారం కొమురవెల్లి మండల కేంద్రంలో బాడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యారులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
కొండపాక(కుకునూరుపల్లి), జూన్ 6 : బడిబాట కార్యక్రమాన్ని విజయవతం చేయాలని మండల విద్యాధికారి పి.శ్రీనివాస్‌రెడ్డి కోరారు. గురువారం దుద్దెడలో ఉపాధ్యాయుల ఆధ్వర్యం లో జరిగిన బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మి, ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు.
బెజ్జంకి, జూన్ 6: బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో లక్ష్మప్ప కోరారు. మండల కేంద్రంతోపాటు అన్ని గ్రా మాల్లో బడిబాట కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. బెజ్జంకిలో పాల్గొన్న ఎంపీడీవో మాట్లాడుతూ బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని కోరారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు శ్రీరాములు పాల్గొన్నారు.