Medak | కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి.. సోమక్కపేట పీఎసీఎస్ ఇంచార్జ్ చైర్మన్ రామచంద్ర రెడ్డి
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సోమక్క పేట పీఏసీఎస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిట్కుల్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘం సీఈవో పోచయ్యతో కలిసి చైర్మన్ ప్రారంభించారు.
Medak | చిలిపిచెడ్, అక్టోబర్ 27: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సోమక్క పేట పీఏసీఎస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిట్కుల్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘం సీఈవో పోచయ్యతో కలిసి చైర్మన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని అన్నారు. ధాన్యంలో తేమశాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు మట్టి లేకుండా ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. తూకం వేసిన వెంటనే రైతులకు తమ బ్యాంక్ అకౌంట్, పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ సెంటర్ ఇంచార్జ్‌కు అందజేయాలన్నారు.
ఆన్లైన్లో అప్లోడ్ కాగానే 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారని తెలిపారు. ఏ గ్రేడ్ మద్దతు ధర రూ.2389, సాధారణ రకం రూ.2369, సన్నరకం వరి ధాన్యంకు అదనంగా బోనస్ రూ.500 ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, కవిత శ్రీశైలం, చిట్కుల్ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, పీఏసీఎస్ సిబ్బంది, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

