దుబ్బాక, మే 21: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి అన్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ‘ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం’ అనే కథనంపై స్పందించారు. దుబ్బాక మండలం హబ్షీపూర్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్ల వివరాలు, డబ్బుల చెల్లింపులు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందన్నారు. అకాల వర్షాల వల్ల కొంత ఇబ్బందులు ఎదురైన విషయం వాస్తవమన్నారు. ఆమె వెంట సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీవో పీడీ జయదేవ్ ఆర్య, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ హరీశ్ , డీఎస్వో తనూజ, డీపీఎం కిరణ్‌కుమార్ , ఇన్చార్జి ఏపీఎం నర్సింహులు, డిప్యూటీ తహసీల్దార్ సందీప్, ఆర్ఐ నర్సింహరెడ్డి తదితరులున్నారు.