చేర్యాల, జనవరి 23 : మానసిక దివ్యాంగుల్లో మనోైస్థెర్యం కల్పిస్తున్న మనోచేతన స్వచ్ఛంద సంస్థ సేవలు హర్షణీయమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని మనోచేతన సంస్థ ఆధ్వర్యంలో దాత ఇప్ప నిషికాంత్రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే దివ్యాంగులకు దుస్తులు అం దజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో జీవించేందుకు కేసీఆర్ నెలనెలా రూ.3 వేల పింఛన్ ఇచ్చి వారి బతుకుల్లో వెలుగులు నింపినట్లు తెలిపారు.
దివ్యాంగులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలన్నారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజలు దివ్యాంగులతో ప్రేమగా మెలగాలని కోరారు. దశాబ్దాలుగా చేర్యాల ప్రాంతంలో మనోచేతన సంస్థ దివ్యాంగుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు మరిచిపోలేనివన్నారు. మనోచేతన సంస్థకు అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.