సిద్దిపేట టౌన్, అక్టోబర్ 1: దివ్యాంగులకు దస రా పండుగ నుంచి రూ.6వేల చొప్పున పింఛన్ హామీని అమలు చేయాలని, లేదంటే సచివాలయాన్ని, గాంధీభవన్‌ను ముట్టడిస్తామని దివ్యాంగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ దివ్యాంగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో మంగళవారం నిరస న తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం జిల్లా అధ్యక్షుడు కెమ్మసారం అశోక్ మాట్లాడుతూ..సీఎం రేవంత్‌రెడ్డి దివ్యాంగులను పట్టించుకోవడం లేదన్నారు.
దివ్యాంగుల సమస్యలను పరిష్కరిస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే పెద్దఎత్తున నిరసనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో దివ్యాంగులు కుమార్, సురేశ్, పద్మారెడ్డి, నరసింహులు, లక్ష్మ ణ్, శ్రీనివాస్, సుధాకర్, అనిల్, మల్లేశం, శ్రీను, రాకేశ్, ఎల్లయ్య, దుర్గయ్య, అమృత్, రవితేజ, ప్రవీణ్, సోమయ్య, కనకచంద్రం, పోచయ్య, రాణి, మల్లవ్వ, సర్వూప, భాగమ్మ పాల్గొన్నారు.