నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ సిఎస్ఐ చర్చి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయాంటూ సీఎస్ఐ సంఘాల నేతల ఆదివారం చర్చి ముందర ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 125 ప్యానల్ ఓటుకు నోటుకు పాల్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రెస్ బేటర్ ఇంచార్జ్ దారా సందీప్ కుమార్ ను సస్పెండ్ చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. సొంత స్వలాభం కోసం అక్రమంగా సీఎస్ఐ కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా గ్రామాల నుండి పిసి మెంబర్లను ఎన్నుకున్నారని ఆరోపించారు.
ఓటుకు నోటు ప్రోత్సహించి ఇల్లీగల్‌గా ఎన్నికలు నిర్వహించిన రేవ్ ధార సందీప్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని క్రైస్తవ సంఘా సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గిడ్ల జయప్రకాష్ , ప్రభాకర్, రాజ్ కుమార్, నవీన్ కుమార్, కిరణ్ కుమార్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.