ప్రాజెక్టులు, చెరువులు పర్యాటక శోభను సంతరించుకున్నాయి. వర్షం తెరిపివ్వడం.. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు, ప్రకృతి ప్రియులు కుటుంబసభ్యులతో కలిసి నీటివనరుల వద్దకు తరలివచ్చి సందడి చేశారు. సహపంక్తి భోజనాలు,ఆటపాటలు, ట్రెక్కింగ్ చేస్తూ సరదాగా గడిపారు. మత్తడి దుంకుతున్న నీళ్లలో జలకాలాడారు. పర్యాటకులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోచారం ప్రాజెక్టు, జాడిమల్కాపూర్ జలపాతం పర్యాటకులతో కళకళలాడాయి.
– మెదక్ ఫొటోగ్రాఫర్, జూలై 23
పోచారం డ్యామ్ ,జహీరాబాద్ జాడి మల్కాపూర్ జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొన్నది. అక్కడే వనభోజనాలు చేశారు. చిన్నారులు, పెద్దలు జలకాలాటలో మునిగితేలారు.
-మెదక్ ,సంగారెడ్డి ఫొటోగ్రాఫర్స్, జూలై 23