పుల్కల్, జూలై 28: సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు ఆదివారం 3,377 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వచ్చినట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీం ఎంసీలు కాగా,ప్రస్తుతం ప్రాజెక్టులో 14.324 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ఔట్‌ఫ్లో ్ల 391 క్యూసెక్కులు కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి వరద వస్తున్నదని తెలిపారు. ప్రాజెక్టు మీటర్లు 523.600 ఎత్తుకు, ప్రస్తుతం 519.800 మీటర్లలో నీరు ఉంది. తాలెల్మ ఎత్తిపోతల పథకానికి 41 క్యూసెక్కులు, హెచ్ఎండబ్ల్య్లూఎస్కు 80 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 70 క్యూసెక్కులు, 200 క్యూసెక్కులు వృథాగా దిగువకు వెళ్తున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు.