Prof Jayashankar Death Anniversary | మెదక్ మున్సిపాలిటీ, జూన్ 21 : స్వరాష్ట్ర స్వప్నికుడు, స్వతంత్ర తెలంగాణను ఆకాంక్షించి కడవరకు ఉద్యమ వ్యూహరచన చేసి ప్రజలను చైతన్యవంతం చేసిన దార్శనికుడు, తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ అన్నారు. జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్‌సార్ అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన నిరంతర కృషి, ధృడ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరిచిపోదన్నారు. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి జయశంకర్ సార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టి జగపతి, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిళ్ల అంజనేయులు కో కన్వీనర్ గడ్డమీది కృష్ణాగౌడ్, లింగారెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాస్, కిషోర్, జయరాజ్, కిషోర్, మల్లేశం, నాయకులు సాధిక్, అరుణ్ తదితరులు పాల్గోన్నారు.
Sarangapur | కాలువల్లో పేరుకుపోయిన మురుగు.. వర్షం పడితే రోడ్డుపై నడువాలంటే చెప్పులు చేతపట్టాల్సిందే
Pension | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్