సిద్దిపేట, మార్చి 21: అసెంబ్లీలో బీఆర్ఎస్ గళమెత్తడంతో కాంగ్రెస్ సరార్ దిగొచ్చి మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట వ్యవసాయ మారెట్ యార్డులో శనివారం మొకజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొకజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మొన్న అసెంబ్లీలో చేసిన ఒత్తిడితో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. పోరాటం ఫలితంగానే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రా లు ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో రైతులు మొకజొన్న పంటసాగు చేశారని, క్వింటాల్‌కు రూ. 2400 మద్దతు ధర ఉంటే.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో నిన్నటిదాకా రైతులు దళారులకు రూ.1600 నుంచి రూ.1700లకే విక్రయించి నష్టపోయారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే 20 నుంచి 25 శాతం మొకజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలన్నారు. పొద్దుతిరుగుడు క్వింటాల్‌కు రూ. 7721 మద్దతు ధర ఉందని, రైతులు సద్వినియోగం చేసుకుని అధిక ఆదాయం పొందాలన్నారు.
పొద్దుతిరుగుడు సాగుకు రైతులు ఆసక్తి చూపాలన్నారు. కాళేశ్వరం జలాల పుణ్యమా అని సిద్దిపేట ప్రాంతంలో సాగు పదింతలు పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత సిద్దిపేట దరిదాపుల్లో కరువు అనే మాటే లేదన్నారు. సిద్దిపేట మార్కెట్ సెక్రటరీ వెంకటయ్య, పీఏసీఎస్ సీఈవో కృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు శ్రీకాంత్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, బాలమల్లు, నాయకులు ఎల్లారెడ్డి, ఆంజనేయులు, అరవింద్‌రెడ్డి, వేణు, మహేశ్, నర్సింహులు పాల్గొన్నారు.