రాయపోల్ : సంక్రాంతి ( Sankranthi ) పండుగ సందర్భంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీల ( Muggula competition ) విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. మండల పరిధిలోని తిమ్మక్కపల్లి, అనాజీపూర్, వీరారెడ్డి పల్లి తో పాటు పలు గ్రామాల్లో ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచులు ( Sarpanches ) ముగ్గుల పోటీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు రంగురంగుల ముగ్గుల వేసి పోటీల్లో పాల్గొన్నారు. తిమ్మకపల్లి గ్రామంలో సర్పంచ్ సత్తు అశోక్ రెడ్డి, గ్రామ యువత నాయకులు యాదగిరి తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు తొగుట సీఐ షేక్ లతీఫ్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతి ,సాంప్రదాయాలు పరిరక్షించుకోవాలని సూచించారు.