రామాయంపేట, జూన్ 12 : రామాయంపేట పురపాలిక పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలలో లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హులైన వారు తమ ధరఖాస్తులను అందించాలని ప్రిన్సిపల్ అనురాధ పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో విలేకరలుతో మాట్లాడారు. 2025-26 సంవత్సరంకు గాను ఇంటర్ మొదటి సంవత్సరం అప్డేట్ చేయబడిందని అందు కోసం అర్హులైన లెక్చరర్లు ఇంగ్లీషు 1, తెలుగు 1, ఫిజిక్సు 1, కెమెస్ట్రీ 1, బోటనీ 1, జూలాజీ 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
దరఖాస్తులు చేసుకునే వారు బీఈడీ, పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలన్నారు. గెస్టు ఫ్యాకల్టీగా ఈనెల 14వరకు తమ దరఖాస్తులను కేజీబీవిలో నేరుగా అందజేయాలన్నారు. అంతే గాకుండా బైపీసీలో జాయిన్ కావడానికి ఇంటర్ విద్యార్థులకు ఖాళీలు ఉన్నాయని విద్యార్థులు దరఖాస్తులను చేసుకోవాలన్నారు.