మెదక్, మే 8 (నమస్తే తెలంగాణ): ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం కోసం నూతన కలెక్టరేట్, పోలీస్ భవన సముదాయాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేరొన్నారు. సోమవారం టీఎన్జీవో జిల్లాశాఖ బృందంతో కలిసి సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. చకాచకా సాగుతున్న పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల చెంతకు పాలన ఉద్దేశంతో ప్రభుత్వం పెద్దగా ఉన్న జిల్లాలను విభజించి, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు.
దాంతో సామాన్యులకు దూర భారం, రవాణా ఖర్చులు తగ్గి, అందుబాటులో అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సంకల్పించిందన్నారు. జిల్లా ప్రజలకు మరియు ఉద్యోగులకు అన్ని రకాలుగా అనుకూలంగా ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట ఉండేవిధంగా కలెక్టరేట్ భవనాలను నిర్మించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మినికి రాజ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గాండ్ల అనురాధ, కోశాధికారి బట్టి రమేశ్, ఉపాధ్యక్షులు మంగ మనోహర్, ఎండీ ఇక్బాల్ పాషా, ఎండీ ఫజులురుద్దీన్, మెదక్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు పంపరి శివాజీ, ఆరేళ్ల రామా గౌడ్, నీటిపారుదల శాఖ డీఏవో తోట కుమార్ నీల తదితరులు పాల్గొన్నారు.