అక్కన్నపేట, సెప్టెంబర్ 12: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అభివృద్ధి పనులకు సిద్దిపేట కలెక్టర్ హైమావతితో కలిసి శంకుస్థాపన చేశారు. మండలంలోని బొడిగపల్లి, మంచినీళ్లబండలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. మండలంలోని మ ల్లంపల్లి -తాళ్లతండా, బొడిగపల్లి – సంజీవయ్యకాలనీ, మంచినీళ్లబండ- యాటాకార్లపల్లి మధ్య బీటీ, పీఆర్ రోడ్లు, మల్లంపల్లి-చౌటపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న రోడ్లు, హై లెవల్ బ్రిడ్జి నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. ఎంపీడీవో కార్యాలయానికి నిధులు మంజూరయ్యాయన్నారు. గిరిజన సంక్షేమశాఖ తరపున రూ.10 కోట్లు రోడ్ల నిర్మాణానికి మంజూరు చేశామన్నారు. గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాల పనులు కొనసాగుతున్నాయన్నారు. భూ భారతిలో అక్కన్నపేట మండలాన్ని పైలెట్ మండలంగా చేర్చామన్నారు. మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొంది ంచామన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వలకు సంబంధించిన పరిహారం చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. కాల్వల భూ సేకరణకు రైతుల త్యాగం వెలకట్టలేనిదన్నా రు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్, డీపీవో దేవకీదేవి, ఆర్డీవో రామ్మూర్తి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లింగమూర్తి పాల్గొన్నారు.