సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 9:సిద్దిపేట జిల్లా లో ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహహరిస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ బుధవారం హెచ్చరించారు. ఇటీవల సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత బెట్టింగ్ యాప్‌ల మోజులోపడి బంగా రు భవిష్యత్‌ను అంధకారం చేసుకోవడమే కాకుండా అప్పులపాలై ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారన్నారని సీపీ పేర్కొన్నారు. సోష ల్ మీడియా యువతకు మరింత చేరువ కావ డం ద్వారా మోసపూరితమైన ప్రకటనలు, సందేశాలకు ఆకర్షితులై సులభంగా మోసపోతున్నట్లు తెలిపారు.
ఈజీగా డబ్బు సంపాదించాల లక్ష్యం తో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌తోపాటు ఇతరత్రా బెట్టింగ్‌ల వైపు యువత తొంగిచూడడమే కాకుండా కుటుంబీకులకు తెలియకుండా పెట్టుబడులు పెట్టి ఆర్థికం గా నష్టపోతున్నారన్నారు. ఐపీఎస్ సీజన్ ప్రారంభమైనందున తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని, క్రికెట్ మ్యాచ్‌లు ప్రసారమయ్యే సమయాల్లో వారి ప్రవర్తనతోపాటు సెల్‌ఫోన్ సంభాషణపై దృష్టి పెట్టాలని సూచించారు. బెట్టింగ్‌లకు పాల్పడితే డయల్ 100 లేదా కంట్రోల్ రూమ్ 8712667 100 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.