సిద్దిపేట, డిసెంబర్ 23 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్ అమలు చేయడంతో కార్మిక రంగం తీవ్రంగా నష్టపోతున్నదని కేరళ కార్మిక, విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్దిపేట డిగ్రీ కాలేజీ మైదానంలో సీఐటీయూ రాష్ట్ర నాల్గో మహాసభల బహిరంగ సభలు జరిగా యి. అంతకు పట్టణంలో మహా ప్రదర్శన నిర్వహించారు. ఈ సభలకు సీఐటీయూ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు హేమలత, తపన్‌సేన్, జాతీయ ఉపాధ్యక్షుడు సాయిబాబా, రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, నాయకులు ఎస్ వీరయ్య, రమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివన్ కుట్టి మాట్లాడారు. దేశంలో 90శాతం కార్మికులు అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నారని, వారి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. రోజంతా పని చేసినా వారికి సరిపడా వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేదన్నారు.
దేశం లో ఎంతమంది కార్మికులకు కనీస వేతనం కల్పిస్తున్నారని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. దేశంలో అచ్చేదిన్ ఎవరికి వచ్చింది? కార్మికులకా? కార్పొరేట్లకా! అని ఎద్దేవా చేశారు. యూపీలో అంగన్వాడీలకు రూ.4500 వేతనం ఇవ్వడం ‘సబ్కా సాత్.. సబ్ క వికాసా’? అని అన్నారు. లేబర్ కోడ్ అమల్లోకి రావడంతో కార్మికులు కనీసం సంఘాలు పెట్టుకునే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు అప్పనంగా అప్పగిస్తున్నరని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పేదరికం పెరిగిందన్నారు. యూఎస్ఎస్ఆర్ పతనం తర్వాత పెట్టుబడిదారి శక్తులు బలపడ్డాయన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కార్పొరేట్ విధానాలను దేశంపై రుద్దారన్నారు. దీం తో లాభపడింది పెట్టుబడిదారులన్నారు. అభివృద్ధి పేరుతో మోదీ వచ్చి, దేశంలోని తన అనుకూల మీడియాను అడ్డం పెట్టుకొని, ప్రజలను మోసగించారన్నారు.
కొవిడ్ తర్వాత అనేక కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారిని ఆదుకునేందుకు నెలకు రూ.9వేల వేతనం ఇవ్వాలని కోరినా కేంద్రం అంగీకరించలేదన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకు ఇచ్చేందుకు కేంద్రం సంస్కరణలు తీసుకొస్తున్నదని చెప్పా రు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కార్మిక సంఘమైన బీఎంఎస్ దీనిపై కనీసం పోరాటం చేయలేదన్నారు. మోదీ వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న వారిని మతం, కులం పేరుతో వి భజన చేస్తూ మతోన్మాద ఎజెండాను అమలు చేస్తున్నారన్నా రు. విద్యారంగంలోనూ ఆర్ఎస్ఎస్ విధానాలు అడ్డుకోవాలన్నారు. కేరళలో కార్మిక సంక్షేమ ప్రభుత్వం ఉందన్నారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను కేరళలో అమలు చేయమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజెపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్మికులు, విద్యార్థులు, కర్షకులు పోరాటం చేయాలన్నారు.
దేశ సంపదను మిత్రులకు దోచి పెడుతున్న మోదీ
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ తన మిత్రులకు దోచిపెడుతున్నారని సీఐటీయూ జాతీయ కార్యదర్శి తపన్‌సేన్ అన్నారు. మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ తెచ్చిన లేబర్కోడ్లను ఉపసంహరించుకునే దాకా సీఐటీయూ పోరాటం చేస్తున్నదన్నారు. దేశంలో సం క్షేమ సర్కారు కాదు.. వినాశకర సర్కారు ఉందన్నారు. ఏప్రి ల్ 5న ఢిల్లీలో కార్మిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపా రు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు భూపాల్, జయలక్ష్మి, మల్లికార్జున్, వెంకటేశ్, గోపాల స్వామి, రమేశ్, శశిధర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.