చిలిపిచెడ్, మే 4 : ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించడానికి చేపట్టిన హరితహార కార్యక్రమం అనేక ఫలితాలను ఇస్తున్నది. హరితహారం ప్రారంభం నుంచి నాటిన మొక్క లు నేడు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని సంతరించుకుంటున్నా యి. వేసవి సమయంలో ఎక్కడైనా రోడ్డు పక్కన కాస్త నీడన సేద తీరుదామంటే గతంలో నిలువ నీడలేదు. హరితహారం లో నాటిన మొక్కలు ఇప్పుడు నీడతోపాటు ఆహ్లాదాన్ని.. ఆనందాన్ని పంచుతున్నది. రోడ్లు వెంబడి మొక్కలు ఏపుగా పెరిగి ఆకుపచ్చ తోరణాల మాదిరిగా ప్రయాణికులకు స్వాగ తం పలు కుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలతో పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం, వాహనదారులు సేదతీరేందుకు చల్లని నీడను ఇస్తున్నాయి.
చిలిపిచెడ్ మండలంలోని ఆయా గ్రామాలు, పట్టణలకు వెళ్లే రహదారులకు పక్కన ఆరు విడుతల్లో హరితహారంలో భారీస్థాయిలో మొక్కలను నాటారు. నాటిన మొక్కలు ఎం డిపోకుండా ఉండేందుకు అవసరమైన సంరక్షణ చర్యలు తీసుకున్నారు. వనసేవలకును నియమించి, నిత్యం నీటిని పోయడంతో ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. చిట్కుల్ నుంచి మెదక్ వెళ్లే దారిలో బద్రియాతండా వరకు, చండూర్ నుంచి నర్సాపూర్ దారిలో గంగారం వరకు ఆరు విడుతల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. చండూర్ రోడ్డు వెంట మొక్కలను అటవీశాఖ ఆధ్వర్యంలో పెంచుతున్నారు. వాటర్‌ట్యాంక్ సాయంతో ప్రతి మొక్కకు నీరు పోసి పెంచుతున్నారు.
హరితహారంతో ప్రయోజనం
రోడ్డు పక్కన నాటిన హ రితహారం మొక్కలను సంరక్షించడంతో నేడు ఏపుగా పె రిగాయి. దీంతో రోడ్డు వెం ట ప్రయాణించేవారికి ఎండ లో, వానలో చెట్లు నీడన సేదతీరడంతో కాస్త ఉపశమనం లభిస్తుంది. పచ్చ ని మొక్కలు వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచు తున్నాయి.
– గోపాల్‌రెడ్డి, చిట్కుల్ సర్పంచ్
పచ్చదనంతో ఆహ్లాదం
ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో నాటిన మొక్క లు నేడు పచ్చదనాన్ని పంచు తున్నాయి. రోడ్ల వెంబడి వెళ్లే ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచడంతోపాటు సేద తీర్చు తున్నాయి. నాటిన ప్రతి మొక్కరూ పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి.
– కుణ్యనాయక్, బద్రియతండా గ్రామస్తుడు