నర్సాపూర్, జూలై7 : ప్రజలు మూత్రవిసర్జనకు, మలవిసర్జనకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ హయాంలో నర్సాపూర్ మున్సిపాలిటీలో నాలుగు చోట్ల మరుగుదొడ్లను ని ర్మించారు. ముఖ్యంగా మహిళలు, యువతులు ఇబ్బందులకు గురికాకూడదని జన సంచారం ఎక్కువ ఉన్న చోట ఈ మరుగుదొడ్లు నిర్మించారు. నేడు వాటి నిర్వహణ సరిగ్గా లేక జనాలు అవస్థలకు గురవుతున్నారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాల్సిన మరుగుదొడ్లకు సిబ్బంది తాళాలు వేశారు. దీంతో ప్రయాణికులు, బాటసారులు మల, మూత్ర విసర్జనకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక అవస్థలు పడాల్సి వస్తున్నది. నర్సాపూర్‌ను అన్నివిధాలా అభివృద్ధి చెందడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా వివిధ మండలాలకు చెందిన వారు అధిక సంఖ్యలో వస్తుంటారు. మల, మూత్ర విసర్జనకు వెళ్లడానికి మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కొంతమంది చేసేదేమీ లేక పట్టణంలోని రోడ్ల పక్కన, గల్లీల్తో, ఆరుబయట మూత్రవిసర్ణన చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఓ వైపు పారిశుధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే, సిబ్బంది నిర్యక్ష్యం తో మరుగుదొడ్లకు తాళాలు వేస్తున్నారు.
దీంతో వారు ఆరుబయటనే కానిచ్చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న మూత్రశాలల్లో ముక్కుపుటలు అదిలేలా దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. దీంతో ప్రయాణికులు బస్టాండ్ ఆవరణంలోనే మూత్ర విసర్జన చేస్తున్నారు. బస్టాండ్ లోపల మరుగుదొడ్లకు గడెలేక వెళ్లడానికే జంకుతున్నారు. మూత్రశాలల వద్ద కనీసం బ్లీచింగ్ ఫౌడర్ కూడా చల్లడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే దోమలు, ఈగలు పెరిగి ప్రజల ఆరోగ్యాలు పాడ య్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నా రు. ఇప్పటికైనా మరుగుదొడ్లను శుభ్రం చేయించి జనాల అవస్థలు తీర్చాలని మున్సిపల్, ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్రెడ్డిని వివరణ కోరగా కొత్తగా చార్జ్ తీసుకున్నానని, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు.