ఝరాసంగం, జూలై 10: సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్షుడు నర్సింలు మాట్లాడుతూ డిమాండ్స్ డేలో భాగంగా కేంద్ర వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశామన్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదం తెలిపిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నాయకులు నాగమణి, చంద్రకళ, శాంతమ్మ, జగదాంబ పాల్గొన్నారు.
గుమ్మడిదల, జూలై 10:కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సీఐటీయూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని బొంతపల్లి, దోమడుగు పారిశ్రామికవాడలో సీఐటీయూ కార్మిక సంఘం నాయకుడు శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో న్యూ లాండ్ పరిశ్రమ వద్ద సీఐటీయూ జెండాను ఆవిష్కరించి ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశా రు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటేశ్‌గౌడ్, సంయుక్త కార్యదర్శి నర్సింహాగౌడ్, ఆర్గనైజర్ కార్యదర్శి దేవేందర్ పాల్గొన్నారు.
రాయికోడ్, జూలై 10: తమకు న్యాయం చేయాలని ఆశా వర్కర్లు, అంగన్వాడీ, పంచాయతీ కార్మికులు పలు డిమాండ్లతో కుడిన వినతిపత్రం అందజేశారు. రాయికోడ్‌లో మండల పత్యేక అధికారి జగదీశ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఎంఎం షరీఫ్‌కు సీఐటీయూ నాయకుడు దశరథ్ వినతిపత్రాలు ఇచ్చారు.
జిన్నారం, జూలై 10: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలని సీఐటీ యూ నాయకులు డిమాండ్ చేశారు. ఖాజీపల్లి పారిశ్రామికవాడలోని టీఐడీసీ పరిశ్రమ ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. నాయకులు శ్రీధర్‌రావు, వెంకటేశ్, నరసింహగౌడ్, భాస్కర్‌రెడ్డి, శేఖర్, సత్తయ్య పాల్గొన్నారు.
కోహీర్, జూలై 10: మూడు నెలలుగా వేతనాలు అందడం లేదని అంగన్వాడీ టీచర్లు ఆరోపించారు. బుధవారం తహసీల్దార్ బాలశంకర్‌కు వినతిపత్రం ఇచ్చారు. తమకు వేతనాలు అందేలా చూడాలని కోరారు.
కోహీర్, జూలై 10: పనికి తగ్గ వేతనం ఇవ్వాలని పలు గ్రామాల ఆశ వర్కర్లు కోరా రు. డిమాండ్ డే సందర్భంగా బుధవారం కోహీర్ పట్టణంలోని తహసీల్దార్ బాలశంకర్‌కు వినతిపత్రం అందజేశారు.
హత్నూర, జూలై 10: తమ సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మె చేయడానికి సిద్ధం గా ఉన్నామని పంచాయతీ కార్మికులు హెచ్చరించారు. ఈ మేరకు తహసీల్దార్ ఫర్హీన్షేక్కు వినతిపత్రం ఇచ్చారు. పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి శంకరయ్య పాల్గొన్నారు.