హుస్నాబాద్ టౌన్, అక్టోబర్ 27: బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పనులకు నిధుల వరదను పారించడంతో పట్టణ ప్రగతి పరుగులు పెట్టింది. కాంగ్రెస్ సర్కారు సుమారు పది నెలలుగా పట్టణ ప్రగతికి నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. గతంలో చేసిన పనులకు సైతం బిల్లులు చెల్లించకపోవడంతో కాం ట్రాక్టర్లు కొత్తపనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. పట్టణాల్లో పలు రకాల అభివృద్ధి పనులను చేపట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా పట్టణ ప్రగతికి 2020 ఫిబ్రవరిలో శ్రీకారం చుట్టింది.
ప్రతినెలా ఆయా మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయడంతో అనేక పనులు చేపట్టారు. కొత్తగా పార్కుల నిర్మాణం, జిమ్‌లు, శ్మశాన వాటికలు, మురుగుకాల్వలు, సీసీరోడ్లతో పాటు పలు రకాల పనులు చేపట్టారు. విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలకు సైతం ఇవే నిధులు వినియోగించేవారు. ప్రతినెలా హుస్నాబాద్ మున్సిపాలిటీకి రూ.10 లక్షల వరకు నిధులు మంజూరు అయ్యేవి. ప్రస్తుతం ఆ నిధులు రాకపోవడంతో పట్టణ ప్రగతి ముందుకు సాగడం లేదు.
ఇంటి, నల్లాపన్నుల నుంచి వచ్చే ఆదాయం అంతంతమాత్రంగానే ఉండటంతో అభివృద్ధి పనులకు నిధులు లేక మధ్యలోనే నిలిచిపోతున్నాయి. హుస్నాబాద్ బల్దియాలో విద్యుత్ స్తంబాలు, వీధిదీపాల కొనుగోలుకు సైతం నిధులు లేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభు త్వం నిధులు ఇవ్వాలని ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. పట్టణ ప్రగతికి నిధులు రాకపోవడం వాస్తమేనని, దీంతో ఇబ్బందులు అవుతున్నాయని వాస్తవమేనని హు స్నాబాద్ మున్సిపల్ కమిషనర్ టి.మల్లికార్జున్‌గౌడ్ పేర్కొన్నారు.