నర్సాపూర్/ కౌడిపల్లి/ మెదక్ రూరల్/ కొల్చారం, మే 29 : నర్సాపూర్ పట్టణంలోని సంగారెడ్డి రోడ్డులో ఉన్న రేణు కాఎల్లమ్మ ఆలయ 11వ వార్షికోత్సవ వాల్‌పోస్టర్‌ను ఆది వా రం గౌడ కులస్తులతో కలిసి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ.. జూన్ 4, 5 తేదీల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 4న విఘ్నేశ్వర పూజ, స్వస్తి పుణ్యావాచనం, ఎల్లమ్మ జమదగ్ని కల్యాణోత్సవం, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం ఊరేగింపు, 5న సామూహిక కుంకుమార్చనలు, బోనాల ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రజలందరూ భక్తిమార్గంలో నడవాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సూచించారు. పోస్టర్ ఆవిష్కరణలో గౌడ కులస్తులు అశోక్‌గౌడ్, ఆంజనేయులుగౌడ్, నాగరాజుగౌడ్, రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
కిక్కిరిసిన నల్లపోచమ్మ ఆలయం

కౌడిపల్లి మండలం తునికి గ్రామశివారులోని అటవీప్రాంతంలో వెలిసిన నల్లపోచమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసినది. ఆదివారం సెలవుదినం కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి తలనీలాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధాన పూజారి శివప్ప అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు.
మల్లన్నకు పూజలు, అభిషేకాలు

మెదక్ మండలంలోని మంబోజిపల్లి శివారులో వెలిసిన కొయ్యగుట్ట మల్లికార్జునస్వామి అలయానికి భక్తులు పోటె త్తారు. భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. పూజరి మల్లన్నస్వామి మాట్లాడుతూ.. అమావాస్య పురస్కరించుకొని మల్లన్న స్వామి ఆల యంలో నిత్యపూజలతోపాటు నవగ్రహ పూజలు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కొల్చారంలో భక్తిశ్రద్ధలతో పల్లకీసేవ
కొల్చారం మండల కేంద్రంలోని శివాలయంలో శనివా రం రాత్రి మాస శివరాత్రి పురస్కరించుకుని స్వామివారికి ప్రదోషకాల అభిషేకం, పల్లకీసేవ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆలయ ఆవరణలో అన్నదానం నిర్వహించారు. భక్తు లు పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.