శివ్వంపేట, డిసెంబర్ 28: మండల కేంద్రమైన శివ్వంపేటలో నిర్మిస్తున్న బగలాముఖి శక్తిపీఠం బాలాలలయంలో మంగళవారం రాత్రి అమ్మవారికి ఆలయ ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ పూజా కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దేవసేన హాజరుకాగా, ఆలయ మర్యాదలతో ఉపాసకులు స్వాగతం పలికారు. పుష్పాలతో అమ్మవారిని అలంకరించి పసుపార్చన, మంగళహారతి నిర్వహించారు. తెలుగు రాష్ర్టాల్లోనే బగలాముఖి శక్తిపీఠం నిర్మాణం శివ్వంపేటలో జరగడం మొదటిదని, అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు విద్యాశాఖ కమిషనర్ దేవసేన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో బుచ్యానాయక్, పురోహితులు పురుషోత్తంశర్మ, టీచర్లు వర్గంటి సంతోష్‌కుమార్, మాధవి పాల్గొన్నారు.