బెజ్జంకి, జూలై 20: సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని మోడల్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్, పీఈటీలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, పిల్లలు పాఠశాల ఎదుట సోమవారం బైఠాయించి ఆందోళన దిగారు. పీఈటీ కనకారెడ్డి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ తీరు బాగా లేదని, నచ్చని ఉపాధాయ్యులపై విద్యార్థులచే బలవంతంగా తప్పుడు ఫిర్యాదులు చేయిస్తుందని, పీఈటీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ప్రిన్సిపాల్‌కు చెప్పి నా పట్టించుకోలేదని విద్యార్థినులు తెలిపా రు.
పాఠశాలలో ఉన్న పీఈటీపై పిల్ల ల తల్లిదండ్రులు దాడిచేశారు. ఈ వి షయం తెలుసుకు న్న ఎస్సై తిరుపతి, పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఎంఈవో మహతిలక్ష్మి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని, పూర్తి స్థాయి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. అనంతరం పిల్లల తల్లిదండ్రులు ఎంఈవోకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ బొల్లం శ్రీధర్, ఉపసర్పంచ్ దుమ్మాల మహేశ్, వార్డు సభ్యులు, సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు.