సంగారెడ్డి నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీలు, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేశారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య సోమవారం జిల్లాలోని 613 పంచాయతీల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేశారు. కలెక్టర్ విడుదల చేసిన గెజిట్‌కు అనుగుణంగా జిల్లాలోని 613 పంచాయతీలు, 5370 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా ఉండేలా పంచాయతీరాజ్‌శాఖ జీవో 46 జారీ చేసింది. ఈ జీవోకు అనుగుణంగా జిల్లా యంత్రాం గం రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టింది. ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా చేపట్టారు. 2011 జనాభా లెక్కులు, కులగణన-2024 సర్వే ఆధార ంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 పంచాయతీలు ఉండగా ఇందులో 283 పంచాయతీ సర్పంచ్ స్థానాలను మహిళలకు, 330 సర్పంచ్ స్థానాలు రిజర్వు అయ్యాయి.
613 పంచాయతీల్లో వందశాతం ఎస్టీ జనాభా ఉన్న 81 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను పూర్తిగా ఎస్టీలకు రిజర్వు చేశారు. ఇందులో 39 స్థానాలకు మహిళలకు రిజర్వు చేశారు. వందశాతం ఎస్టీలకు రిజర్వు చేసిన సర్పంచ్ స్థానాలు పోగా మిగిలిన 532 పంచాయతీల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్లను అమలు చేశారు 18 పంచాయతీ సర్పంచ్ స్థానాలను ఎస్టీలకు రిజర్వు చేయగా ఇందులో ఆరు స్థానాలు మహిళలకు 12 స్థానాలు పురుషులకు రిజర్వు చేయటం జరిగింది. ఎస్సీలకు 126 సర్పంచ్ స్థానాలు రిజర్వు కాగా ఇందులో 56 స్థానాలు మహిళలు, 70 స్థానాలు పురుషులకు రిజర్వు చేశారు. బీసీలకు 117 సర్పంచ్ స్థానాలు రిజర్వు కాగా ఇందులో మహిళలకు 52, పురుషులకు 65 స్థానాలు రిజర్వు చేశారు.
జనరల్ కేటగిరీలో 271 సర్పంచ్ స్థానాలు రిజర్వు కాగా ఇందులో మహిళలకు 130, పురుషులకు 141 రిజర్వు చేశారు. జిల్లాలో 613 పంచాయతీల్లో 5370 వార్డులు ఉన్నాయి. వీటిలో వందశాతం ఎస్టీలను ఉన్న 596 వార్డులను పూర్తిగా ఎస్టీలకు రిజర్వు చేశారు. ఇవి కాకుండా అదనంగా మరో 156 పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. ఇందులో పురుషులకు 101, మహిళలకు 55 స్థానాలు రిజర్వు అయ్యాయి. ఎస్సీలకు 1123 పంచాయతీ వార్డులు రిజర్వు కాగా ఇందులో 480 స్థానాలు మహిళలకు 643 స్థానాలు పురుషులకు కేటాయించారు. బీసీలకు 1104 వార్డులు రిజర్వు కాగా 464 వార్డులు మహిళలకు, 640 వార్డులు పురుషులకు కేటాయించారు.
2391 వార్డులు జనరల్ కేటగిరీలో రిజర్వు కాగా ఇందులో 1107 వార్డులు మహిళలు, 1284 స్థానాలు పురుషులకు రిజర్వు అయ్యాయి. రిజర్వేషన్ల ప్రక్రియపై బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 46 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించి మోసం చేసిందని బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 117 సర్పంచ్ స్థానాలు మాత్రమే బీసీలకు రిజర్వు చేయడం సరికాదన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 46 శాతం రిజర్వేషన్ అమలు చేసి పంచాయతీ ఎన్ని కలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.