Palle Prakruthi Vanam | పటాన్చెరు, మే 3 : పల్లె ప్రజలకు ఆహ్లాదాన్ని ఆందించేందుకు ఏర్పాటు చేసి పల్లె ప్రకృతి వనాలు అధ్వాన్నంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. గ్రామాలకు సమీపంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిన చెట్లు పెంపకం చేసింది. ప్రకృతి వనంలో ప్రజలు వాకింగ్ చేసేందుకు వాకింగ్ ట్రాక్లు నిర్మాణం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి చెట్లు పెంచింది. చెట్లుకు నీరు అందించేందుకు బోర్లు ఏర్పాటు చేయడంతో పాటు ట్యాంకర్లు ద్వారా మొక్కలకు నీరు సరఫరా చేశారు. పచ్చని చెట్లుతో కళకళలాడే ప్రకృతి వనల్లో ఉన్న చెట్లు ప్రస్తుతం ఎండిపోతున్నాయి. క్రీడా ప్రాంగణంలో పరికరాలు లేకపోవడంతో ఎడారిగా మారాయి.
జిన్నారం మండంలోని నల్తూర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెట్లుకు సంరక్షణ చర్యలు చేయకపోవడంతో ఎండిపోతున్నాయి. నల్తూర్ పంచాయతీ పరిధిలో ఉన్న కొర్లకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం ఆధ్వానంగా మారింది. పర్యవేక్షణ చేయవలసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరించడంతో పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి.
జిన్నారం మండలంలోని నల్తూర్ గ్రామా పంచాయతీ పరిధిలో నల్తూర్, కొర్లకుంట గ్రామాలు ఉన్నాయి. గత ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసి రెండు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు పెంచేందుకు గత ప్రభుత్వం పంచాయతీలకు ట్రాక్టర్లు , ట్యాంకర్లు అందజేశారు. పంచాయతీల నిర్వహణ కోసం ప్రతి నెల నిధులు విడుదల చేసేవారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు పర్యవేక్షణలో మొక్కల సంరక్షణ చేసే వారు. గ్రామంలో పచ్చని చెట్లుతో పల్లె ప్రకృతి వనాలు కళకళలాడేవి. గ్రామస్తులు ఉదయం, సాయంత్రం పల్లె ప్రకృతి వనంకు వెళ్లి చెట్లు మద్యం వాకింగ్ చేయడంతో పాటు కాలక్షేపం చేసేవారు. పంచాయతీలకు పాలక వర్గం లేకపోవడంతో పాటు పర్యవేక్షణ లేక చెట్లుకు నీరు పోయకపోవడంతో ఎండిపోతున్నాయి. చెట్లు ఎండిపోతున్న సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదు. పల్లె ప్రకృతి వనంలో పెంచిన మొక్కలు సంరక్షన కోసం కూలీలు పని చేసే వారు. ప్రస్తుతం కూలీలు కనిపించడం లేదు. దీంతో మొక్కలను చెట్లు చేసిన కాపాడే వారు లేక పశువులు, మేకలకు మేతగా మారిపోతున్నాయి.
రూ. లక్షలు ఖర్చు చేసి నల్తూర్, కొర్లకుంట గ్రామంలో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. క్రీడా ప్రాంగణంలో గ్రామస్తులు ఆటలు అడేందుకు పరికరాలు ఏర్పాటు చేశారు. ఆటలు ఆడే పరికరాలు క్రీడా మైదానంలో కనిపించడం లేదు. ఎక్కడ చూసి బోర్డులు కనిపిస్తున్నాయి. పరికరాలు లేక గ్రామస్తులు ఆటు వైపు పోవడం లేదు. పశువులు,మేకలు, గొర్రెలను క్రీడా మైదాలకు తీసుకవచ్చి ఉంచుతున్నారు. పరికరాలు లేకపోవడంతో ఎడారిగా మారిపోయిన్నాయి. ఆట వస్తువులు దొంగల పాలు కావడం జరిగింది. ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో పచ్చని చెట్లు ఎండిపోయి, క్రీడా మైదానాలు ఎడారిగా మారాయి.