చేర్యాల, మార్చి 15: జనగామ నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శనివారం సర్కారుపై ఫైర్ అయ్యారు. దేవాదుల ఎత్తిపోతల నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలు పంపింగ్ చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో నింపారని, మొదటిసారి కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఎండబెట్టారని, దీంతో రూ.600 కోట్ల నష్టం కలిగిందన్నారు.
రిజర్వాయర్ నిర్ధేశిత ఆయకట్టుకు నీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దేవాదుల నిర్వాహణ సంస్ధలకు రూ. 6 కోట్లు ఇవ్వలేదని, దీంతో 34 రోజుల పాటు సంస్థ ఉద్యోగులు సమ్మె చేశారని, అసలు ప్రజా ప్రభుత్వం పాలన ఇదేనా అని ప్రశ్నించారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తపాస్‌పల్లి నుంచి నీళ్లు తీసుకుపోతానని అంటాడని, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే సైతం నీళ్లు తీసుకుపోతానని అంటే ఏంటని ప్రశ్నించారు.
రైతులకు బోనస్ అనేది బోగస్ అయిపోయిందని, కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు పెరిగిపోయాయని, ఇప్పటి వరకు 564 రైతుల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పంట రుణమాఫీ వందశాతం చేశామని ప్రకటించిన సర్కారు తన నియోకవర్గంలోని 127 గ్రామాల్లో ఏ గ్రామానికైనా వెళ్లి విచారణ చేస్తామని, 100 శాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాయడమే కాకుండా రాజీనామా చేస్తానని ప్రకటించారు. రైతుబీమాను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
చేర్యాల, మార్చి 15: జనగామ నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లు నింపాలని శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో మధ్యాహ్నం ప్రభుత్వం పంపులను వెంటనే ఆన్ చేయాలని ఆదేశించింది. అధికార యంత్రాంగం బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తే సరిపోదన్నారు.
బొమ్మకూరుతో పాటు కన్నెబోయినగూడెం, లద్నూర్, తపాస్‌పల్లి రిజర్వాయర్లను వెంటనే నింపాలన్నారు. దేవన్నపేట నుంచి ధర్మసాగర్‌కు వచ్చేటటువంటి కొత్తది పైపులైన్ ఏదైతే థర్ ్డప్లేస్లో ఉన్నదో దానిని వెంటనే ఆన్చేయాలన్నారు. సీఎం వెంటనే మూడో ఫేస్‌ని ఆన్ చేయాలని కోరారు రిజర్వాయర్లను నింపి తద్వారా చెరువులు నింపి పంటలు కాపాడాలని కోరారు. పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.