తడిసిన ధాన్యం కొనాల్సిందే
తడిసిన ధాన్యం కొనకుంటే రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని కామారంలో కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించి, తడిసి మొలకెత్తిన ధాన్యా న్ని పరిశీలించారు.
- ధాన్యం మొలకలు వచ్చినా తూకం వేయరా
- మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహం
చిన్నశంకరంపేట, మే 28: తడిసిన ధాన్యం కొనకుంటే రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని కామారంలో కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించి, తడిసి మొలకెత్తిన ధాన్యా న్ని పరిశీలించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్‌తో ఫోన్లో మాట్లాడి, తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మెదక్ నియోజవకర్గంలో నాలుగు ఐదు రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో ప్రభుత్వం ఘారంగా విఫలమైందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి నరక యాతన పడుతున్నారని తెలిపారు. కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి నెల రోజులు గడుస్తున్నా, ఎందుకు తూకం వేయ డం లేదని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అకాల వర్షాలకు ధా న్యం తడిసి ముద్దవుతుంటే, కాంగ్రెస్ ప్రభు త్వం కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుబీమా కోసం ప్రభుత్వం ప్రీమి యం ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ఎరువులు, ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతు లు ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి రావడం దురదృష్టకరం అని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, జిల్లా నాయకులు లక్ష్మారెడ్డి, సర్పంచ్ నరేశ్, మాజీ సర్పంచ్‌లు యాదగిరి యాదవ్, దయానంద్‌యాదవ్, పడాల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

