సిద్దిపేట,డిసెంబర్ 28: సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చే ఎండాకాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికతో వ్యవహరించాలని ట్రాన్స్‌కో అధికారులకు మాజీమంత్రి, ఎమ్మె ల్యే హరీశ్‌రావు సూచించారు. శనివారం సిద్దిపేటలోని ఎస్ఈ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో ఆయన సమీక్షా నిర్వహించారు. నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని, గత పదేండ్లలో ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు దరఖాస్తు పెట్టిన దాఖలాలు లేవన్నారు. నియోజకవర్గంలో 200 వరకు దరఖాస్తులు వచ్చాయని, విఠలాపూర్‌లో 30 వరకు, రాంపూర్‌లో 15 వరకు దరఖాస్తులు ట్రాన్స్ఫార్మర్ల కోసం వచ్చాయన్నారు. వెంటనే సమస్య పరిషారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రంగనాయకసాగర్‌లో నీళ్లు పుషలంగా ఉన్నాయని, విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. సబ్స్టేషన్లలో ఇబ్బందులు తలెత్తవద్దని, అవసరమైన చోట కొత్త గా సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. విద్యుత్ పోల్స్, స్ట్రీట్ లైట్స్ ఎకడ అవస రం ఉన్నా అధికారులు వెంటనే బింగించాలన్నారు. గృహజ్యోతి దరఖాస్తులు ఇవ్వని వారికి మళ్లీ అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. రజకులకు, నాయీ బ్రాహ్మణులకు బీఆర్ఎస్ హయాంలో ఉచిత కరెంట్ సరఫరా చేశామని, దీనిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. సమీక్షలో విద్యుత్ ఎస్ఈ, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాల్లో పెండింగ్ పనులను వేగంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ మను చౌదరిని ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరా రు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్‌తో ఆయన సమావేశమై చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాల పెండింగ్ ఇండ్ల నిర్మాణ పనుల గురించి వివరించారు. వేగంగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాంట్రాక్టర్ మధ్య లో పనులు ఆపేసి వెళ్లిపోయారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.