సంగారెడ్డి జిల్లా కొత్తూరు-బిలోని నారింజ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద వస్తుండడంతో గేట్లపై నుంచి దిగువకు జలాలు వెళ్తున్నాయి.
వరద వస్తుండడంతో ప్రాజెక్టు పరిధిలోని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారు లు సూచించారు. నారింజ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో సాగుకు ఢోకాలేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– న్యాల్కల్, ఆగస్టు 19