సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : యాప్ అగ్రిగేటర్స్ సరసన మరో అగ్రిగేటర్ ‘వోల్టా’ నగరంలో కార్యకలాపాలను ప్రారంభించింది. మిగిలిన యాప్ అగ్రిగేటర్స్ కంటే తక్కువ చార్జీలతో రైడ్ సదుపాయం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కంపెనీ ఎలాంటి కమీషను డ్రైవర్ల నుంచి వసూలు చేయకుండా నేరుగా రైడ్ అప్పగిస్తామన్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో వోల్టా కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. వోల్టా సీఈఓ రాజా విక్రం, వ్యవస్థాపకుడు శశికాంత్ కనపర్తి డ్రైవర్లతో చర్చించి యాప్‌పై అవగాహన కల్పించారు. అంతేకాదు డ్రైవర్లకు ఇన్సూరెన్స్, మెరుగైన భద్రతా చర్యలు, డిజిటల్ మీటర్, ఆదాయం పెంచుకోవడంపై అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. గత నాలుగు నెలల నుంచి వోల్టా నగరంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. 30వేల కస్టమర్లను తమ గమ్యస్థానాలకు చేర్చామని తెలిపింది. త్వరలో వోల్టాను గ్రాండ్‌గా లాంచ్ చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. www.voltacabs.com లేదా ప్లే స్టోర్‌లో వోల్టా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.